Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్

Bandi Sanjay slams Revanth Reddy

  • రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ విమర్శలు
  • రేవంత్ పార్టీ ఎలా నడుపుతున్నారో కాంగ్రెస్ సీనియర్లను అడిగితే తెలుస్తుందని ఎద్దేవా
  • ఓటుకు నోటు తరహాలో డబ్బులు పంచడం తనవల్ల కాదని పరోక్ష వ్యాఖ్యలు

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డిలా పార్టీలు మారడం తనకు చేతకాదని అన్నారు. రేవంత్ రెడ్డి పార్టీ ఎలా నడుపుతున్నారో జానారెడ్డి, కోమటిరెడ్డి, జగ్గారెడ్డిని అడిగితే తెలుస్తుందని వ్యంగ్యం ప్రదర్శించారు. ఓటుకు నోటు కేసు తరహాలో డబ్బులు పంచడం తనవల్ల కాదని చురక అంటించారు. 

తాము హుజూరాబాద్, దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచామని, పార్టీ నడపడం రాకుంటే ఎలా గెలుస్తామని బండి సంజయ్ ప్రశ్నించారు. బీజేపీ గెలుపు ఒరవడిని కొనసాగిస్తుంటే, కాంగ్రెస్ ఓటమి పరంపర కొనసాగిస్తోందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావడంలేదని విమర్శించారు. బీజేపీలో సీనియర్లు బాస్ లు అని, కాంగ్రెస్ లో హోంగార్డులని విమర్శించారు.

Bandi Sanjay
Revanth Reddy
BJP
Congress
Telangana
  • Loading...

More Telugu News