pre wedding: ప్రీ వెడ్డింగ్ షూట్ పిచ్చి ముదిరిందనడానికి నిదర్శనం ఇదీ..!

Bizarre pre wedding photo shoot has left the Internet baffled

  • నాగుపాముతో ప్రీ వెడ్డింగ్ షూట్ చిత్రీకరణ
  • పామును పట్టుకుని పోయే క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ
  • చివరికి నాగుపాము సాక్షిగా ఒక్కటైన జంట

పెళ్లికి ముందు ఫొటో షూట్ నిర్వహించుకునే సంస్కృతి క్రమంగా విస్తరిస్తోంది. జీవితాంతం ప్రత్యేక జ్ఞాపకాలుగా ఉండిపోయేందుకు ఈ ఫొటో షూట్ ను భిన్నంగా చేసుకోవాలని ఎక్కువ జంటలు ఆరాటపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ జంట ఎవరూ చేయలేని విధంగా తమ ప్రీ వెడ్డింగ్ షూట్ ఉండాలని భావించింది. ఇంతకీ వీరు ఏమి చేశారో..? ఫొటోలు గమనిస్తే అర్థం అవుతుంది. 

నాగుపాముతో ప్రీ వెడ్డింగ్ షూట్ నిర్వహించుకోవడం అన్నది ఇంత వరకు విని ఉండకపోవచ్చు. కానీ, ఓ జంట నాగు పాముతోనే ప్రీ వెడ్డింగ్ షూట్ చేసింది. ఈ షూట్ ద్వారా వారు ఇచ్చిన సందేశాన్ని గమనిస్తే.. యువతి తన ఇంట్లోకి వచ్చిన నాగుపామును చూసి, సాయం కోసం కాల్ చేస్తుంది. ఇద్దరు యవకులు స్కూటర్ పై ఆ యువతి ఇంటికి చేరుకుంటారు. ఆ ఇద్దరిలో ఓ యువకుడు నాగపామును బాక్స్ లో బంధించి స్కూటర్ పై తీసుకెళతాడు. వెళుతూ వెళుతూ వెనక్కి చూసి యువతికి కాల్ చేయాలని సైగ చేస్తాడు. ఆ యువతి కాల్ చేసి అతడితో మాట్లాడి, ప్రేమలో పడిపోతుంది. చివరికి వారిద్దరూ చేతిలో చేయి వేసుకుని ముందుకు సాగిపోతుంటే, నాగుపాము పడగ విప్పి వారినే చూస్తుంటుంది. ఇదే ప్రీ వెడ్డింగ్ షూట్ ముగింపు చిత్రం.

pre wedding
photo shoot
Bizarre
snake
  • Loading...

More Telugu News