Sharwanand: జైపూర్ లో అంగరంగ వైభవంగా ప్రారంభమైన హీరో శర్వానంద్ పెళ్లి వేడుక

Sharwanand marriage celebrations started
  • రక్షితా రెడ్డిని పెళ్లాడబోతున్న శర్వానంద్
  • జైపూర్ లోని లీలా ప్యాలస్ లో మొదలైన పెళ్లి వేడుక
  • కాసేపట్లో ప్రారంభం కానున్న మెహందీ ఫంక్షన్
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ శర్వానంద్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. రక్షితా రెడ్డిని శర్వా పెళ్లి చేసుకోబోతున్నాడు. జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా ప్రారంభమయింది. కాసేపట్లో మెహందీ ఫంక్షన్ ప్రారంభం కానుంది. వివాహ వేడుక రాత్రి 11 గంటలకు మొదలు కానుంది. అసలైన పెళ్లి వేడుక రేపు ఉంటుంది. వీరి వివాహానికి పలువురు సినీ స్టార్స్, రాజకీయ నేతలు హాజరుకానున్నారు. 

శర్వానంద్, రక్షిత ఎంగేజ్ మెంట్ జనవరిలో జరిగింది. హైదరాబాద్ లో జరిగిన ఎంగేజ్ మెంట్ లో ఇద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. రక్షిత తండ్రి ఏపీ హైకోర్టు న్యాయవాది. ఆమె తాత ప్రముఖ రాజకీయవేత్త, దివంగత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి.
Sharwanand
Tollywood
Marriage

More Telugu News