Dhoni: ధోనీ మోకాలికి విజయవంతంగా శస్త్రచికిత్స

Surgery to Dhoni knee successful
  • మోకాలి గాయంతోనే ఐపీఎల్ ఆడిన ధోనీ
  • చాలా మ్యాచ్ ల్లో కాలికి బ్యాండేజితో దర్శనం
  • ఫైనల్ ముగిశాక ముంబయి వెళ్లిన ధోనీ
ఇటీవల ముగిసిన ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ చాలా మ్యాచ్ లు మోకాలి గాయంతోనే ఆడాడు. దాదాపు ప్రతి మ్యాచ్ లో ఎడమ మోకాలికి బ్యాండేజితోనే కనిపించాడు. మైదానంలో వికెట్ కీపింగ్ చేసే సమయంలో గాయం తాలూకు బాధ ధోనీ ముఖంలో ప్రతిఫలించింది. 

కాగా, ఐపీఎల్ ఫైనల్ లో విజయం సాధించిన తర్వాత ధోనీ అహ్మదాబాద్ నుంచి ముంబయి వెళ్లాడు. ముంబయిలోని కోకిలా బెన్ ఆసుపత్రిలో ధోనీ ఎడమ మోకాలికి నేడు శస్త్రచికిత్స నిర్వహించారు. బీసీసీఐ వైద్య నిపుణుడు డాక్టర్ దిన్ షా పార్ధీవాలా ఈ శస్త్రచికిత్సను పర్యవేక్షించారు.

ఈ సర్జరీ విజయవంతం అయిందని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ సీఈవో విశ్వనాథన్ వెల్లడించారు. ధోనీ ప్రస్తుతం బాగానే ఉన్నాడని, మరో రెండ్రోజుల్లో డిశ్చార్జి అవుతాడని తెలిపారు. ఇప్పుడు ధోనీకి కావాల్సినంత విశ్రాంతి దొరుకుతుందని, మరో ఐపీఎల్ కు సన్నద్ధమయ్యేందుకు తగినంత వ్యవధి లభిస్తుందని వివరించారు.
Dhoni
Knee
Surgery
CSK
IPL

More Telugu News