tspsc: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరో 13 మంది శాశ్వతంగా డిబార్

TSPSC debars another 13 students permanently

  • భవిష్యత్తులో వీరు పరీక్షలకు హాజరు కాకుండా, ఉద్యోగాలు పొందకుండా చర్యలు
  • జాబితాను విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి
  • డిబార్ అయిన వారి సంఖ్య 50కి పెరిగిన వైనం

ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) మరికొంతమందిని డిబార్ చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న పదమూడు మందిని శాశ్వతంగా డిబార్ చేసింది. భవిష్యత్తులో టీఎస్‌పీఎస్సీ నిర్వహించే ఏ పరీక్షలకు వీరు హాజరుకాకుండా, ఉద్యోగాలు పొందకుండా చర్యలు తీసుకుంది.

ఈ జాబితాను టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ బుధవారం విడుదల చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ప్రమేయం ఉన్న 37 మందిని మంగళవారం శాశ్వతంగా డిబార్‌ చేయగా, తాజాగా మరో 13 మందిని డిబార్‌ చేశారు. దీంతో మొత్తం డిబార్ అయిన వారి సంఖ్య యాభైకి చేరుకుంది.

tspsc
students
Telangana
paper leak
  • Loading...

More Telugu News