rajesh: రాజేశ్, టీచర్ మృతి కేసును ఛేదించిన పోలీసులు

Rajesh and Teacher sujatha murder case

  • హయత్ నగర్ రాజేశ్ మృతి కేసులో వెలుగులోకి షాకింగ్ విషయాలు
  • 24న ఇద్దరూ చివరిసారి కలుసుకొని, పురుగుల మందు తాగి చనిపోవాలని నిర్ణయం
  • టీచర్ పేరు మీద హయత్ నగర్ లో పురుగుల మందు కొనుగోలు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి

హయత్ నగర్ రాజేశ్ మృతి కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రాజేశ్, టీచర్ సుజాత మధ్య ఏం జరిగిందన్నా దానిపైనా, ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపైనా పోలీసులు ఆధారాలు సేకరించారు. దర్యాఫ్తు కొలిక్కి రావడంతో ఇద్దరూ కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఏడాదిన్నర క్రితం మిస్ట్ కాల్ ద్వారా వీరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారి తీసింది. ఈ నెల 24వ తేదీన వారిద్దరూ చివరిసారి కలుసుకొని, పురుగుల మందు తాగి చనిపోవాలని నిర్ణయించుకున్నారు.

టీచర్ పేరు మీద హయత్ నగర్ లోని ఒక షాప్ లో రాజేశ్ పురుగుల మందు కొనుగోలు చేశాడు. 24న ఇంటికి వెళ్లాక టీచర్ పురుగుల మందు తాగింది. అదే రోజు రాజేశ్ కూడా పురుగుల మందు తాగాడు. టీచర్ ను భర్త నాగేశ్వర రావు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం మృతి చెందింది. రాజేశ్ కూడా చికిత్స పొందుతూ మృతి చెందాడు. వారిద్దరి ఫోన్లలో ఉన్న పూర్తి వివరాలతో పోలీసులు కేసును ఛేదించారు.

rajesh
sujatha
suicide
  • Loading...

More Telugu News