csk: చెన్నై ఓపెనర్ రుతురాజ్ కాబోయే భార్య ఎవరో తెలుసా?

Meet Utkarsha Pawar CSK Star Ruturaj Gaikwads Soon to be Wife Who is Also a Cricketer
  • చేసుకోబోయే అమ్మాయిని పరిచయం చేసిన రుతురాజ్
  • ఐపీఎల్ ట్రోఫీతో ఫోటోలకు పోజు ఇచ్చిన కాబోయే దంపతులు
  • రుతురాజ్ గర్ల్ ఫ్రెండ్ కూడా క్రికెటరే!
ఐపీఎల్ పదహారో సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఛాంపియన్ గా నిలిచింది. చెన్నై విజయంలో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కీలక పాత్ర పోషించాడు. ఈ యువ ఓపెనర్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఫైనల్ మ్యాచ్ అనంతరం, తాను చేసుకోబోయే అమ్మాయిని అందరికీ పరిచయం చేశాడు. ఐపీఎల్ ట్రోఫీతో ఇద్దరూ ఫోటోలకు పోజు ఇచ్చారు. రుతురాజ్ చేసుకోబోయే అమ్మాయి గురించి తెలుసుకోవడానికి చాలామంది అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు.

రుతురాజ్ గర్ల్ ఫ్రెండ్ పేరు ఉత్కర్ష అమర్ పవార్. సొంతూరు పూణే. ఆమె కూడా క్రికెట‌ర్ కావడం విశేషం. ఉత్కర్ష పదకొండేళ్ల వ‌య‌సు నుంచే క్రికెట్‌పై మక్కువ పెంచుకుంది. పేస్ బౌల‌ర్ అయిన ఉత్క‌ర్ష మ‌హ‌రాష్ట్ర మ‌హిళా క్రికెట్ జట్టు తరఫున ఆడింది. దేశవాళీలో 10 మ్యాచ్‌లు ఆడి 5 వికెట్లు ప‌డ‌గొట్టింది. ప్ర‌స్తుతం పూణేలోని న్యూట్రిష‌న్, ఫిట్‌నెస్ సైన్స్ ఇన్ స్టిట్యూట్‌లో చదివింది. వీరి మధ్య రెండేళ్లుగా ప్రేమాయణం కొనసాగుతోంది.
csk
Ruturaj Gaikwad

More Telugu News