Guntur Kaaram: గంటలో అర కోటికి పైగా వ్యూస్... 'గుంటూరు కారం' దెబ్బ

Guntur Kaaram title gets record real time views

  • మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో కొత్త చిత్రం
  • గుంటూరు కారం టైటిల్ ఫిక్స్ చేసిన చిత్రబృందం
  • ట్విట్టర్ లో ఇప్పటివరకు 73.1 లక్షల వ్యూస్

మహేశ్ బాబు కెరీర్ లో 28వ చిత్రం గుంటూరు కారం టైటిల్ అనౌన్స్ మెంట్ చేసిన కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. టైటిల్ తో పాటు విడుదల చేసిన మహేశ్ బాబు గ్లింప్స్ వీడియో ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తోంది. 

ట్విట్టర్ లో పంచుకున్న టైటిల్ పోస్టు కేవలం గంట వ్యవధిలో 50 లక్షలకు పైగా వ్యూస్ రాబట్టింది. ప్రస్తుతం గుంటూరు కారం టైటిల్ పోస్టుకు ట్విట్టర్ లో 73.1 లక్షల వ్యూస్ లభించాయి. 

మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబో అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడు సూపర్ హిట్ కాగా, ఖలేజా కొద్దిగా నిరాశపరిచింది. ఇప్పుడీ ఇద్దరి కలయికలో వస్తున్న మూడో చిత్రంపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. గుంటూరు కారం చిత్రం నుంచి వచ్చే అప్ డేట్స్ కు అభిమానుల స్పందన మామూలుగా లేదు. ఇప్పుడు టైటిల్ ప్రకటించారో లేదో... ట్విట్టర్ లో మంట మండిస్తోంది.

Guntur Kaaram
Title
Real Time Views
Mahesh Babu
Trivikram Srinivas
  • Loading...

More Telugu News