Rahul Gandhi: అమెరికాలో రాహుల్ గాంధీకి నిరసన సెగ

Khalisatni supporters raises slogans against Rahul Gandhi

  • కాలిఫోర్నియాలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ కార్యక్రమం
  • సభకు హాజరైన రాహుల్ గాంధీ
  • రాహుల్ కు వ్యతిరేకంగా ఖలిస్థాన్ మద్దతుదారుల నినాదాలు
  • తాము అందరినీ ప్రేమిస్తామన్న రాహుల్

అమెరికా పర్యటనలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి నిరసన సెగ తగిలింది. రాహుల్ గాంధీ కాలిఫోర్నియాలో నిర్వహించిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సభలో రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఖలిస్థానీ మద్దతుదారులు నినాదాలు చేశారు. 

కాంగ్రెస్ హయాంలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లను ప్రస్తావిస్తూ వారు నినాదాలు చేయడంతో సభలో ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. ఖలిస్థానీ మద్దతుదారుల నినాదాలపై రాహుల్ గాంధీ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరినీ అభిమానిస్తుందని తెలిపారు. తాము ఎవరి పట్ల ఆగ్రహావేశాలను, ద్వేషాన్ని ప్రదర్శించబోమని స్పష్టం చేశారు. 

కాగా, రాహుల్ సభలో ఖలిస్థాన్ నినాదాల వీడియో క్లిప్పింగ్ ను బీజేపీ నేత అమిత్ మాల్వియా ట్విట్టర్ లో పంచుకున్నారు. ఇది 1984 నాటి మారణహోమానికి స్పందన అని వెల్లడించారు. మీరు రాజేసిన విద్వేషాగ్ని ఇప్పటికీ మండుతూనే ఉందని మాల్వియా వ్యాఖ్యానించారు.

Rahul Gandhi
Khalistan
Sikh
Congress
USA
India
  • Loading...

More Telugu News