Guntur Kaaram: 'గుంటూరు కారం'... టైటిల్ తోనే ఘాటెక్కిస్తున్న మహేశ్ బాబు

  • మహేశ్ కెరీర్ లో 28వ చిత్రం
  • త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మాస్ ఎంటర్టయినర్
  • టైటిల్ రిలీజ్ చేసిన చిత్రబృందం
Guntur Kaaram is the title for Mahesh Babu new movie

మహేశ్ బాబు అభిమానులను ఎంతగానో ఎదురుచూస్తున్న క్షణాలు రానే వచ్చాయి. మహేశ్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న క్రేజీ ప్రాజెక్టుకు టైటిల్ కన్ఫామ్ చేశారు. 'గుంటూరు కారం'... ఈ మాస్ ఎంటర్టయినర్ చిత్రానికి టైటిల్ ఇదే. 'హైలీ ఇన్ ఫ్లేమబుల్'... అనేది ట్యాగ్ లైన్. 

ఈ సాయంత్రం టైటిల్ ప్రకటించారో లేదో సోషల్ మీడియాలో సూపర్ స్టార్ ప్రభంజనం మొదలైంది. ఎక్కడా చూసినా 'గుంటూరు కారం' ఘాటెక్కిస్తోంది. ఇటీవల విడుదలైన మహేశ్ బాబు ఊర మాస్ లుక్ తో వెర్రెక్కిపోయిన అభిమానులు... ఇప్పుడు 'గుంటూరు కారం' టైటిల్ లో కిర్రెక్కిపోతున్నారు.  

ఈ టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు చిత్రబృందం ఓ టీజర్ వీడియో కూడా పంచుకుంది. ఈ సినిమా ఎలా ఉండబోతోందో, ఈ సినిమాలో మహేశ్ బాబు హీరోయిజం ఎలా ఉండబోతోందో ఈ వీడియోతో హింట్ ఇచ్చేశారు. 

మహేశ్ కెరీర్ లో 28వ చిత్రం కావడంతో ఇప్పటివరకు ఎస్ఎస్ఎంబీ28 వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ జరిపారు. ఇందులో మహేశ్ సరసన పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లు. తమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More Telugu News