KCR: సీఎం వస్తున్నారు... పెళ్లి కోసం బుక్ చేసుకున్న ఫంక్షన్ హాల్ ఇవ్వలేమన్న నిర్వాహకులు

Organizers denies function hall for marriages in the wake of CM KCR tour

  • జూన్ 9న సింగరేణి ఏరియాలో సీఎం కేసీఆర్ పర్యటన
  • సీఎం పర్యటన కోసం ఫంక్షన్ హాల్స్ బుకింగుల రద్దు
  • లబోదిబోమంటున్న పెళ్లి వారు!

మంచిర్యాల జిల్లా నస్పూర్ కు చెందిన పోతు సత్యనారాయణ అనే వ్యక్తికి విచిత్ర అనుభవం ఎదురైంది. సత్యనారాయణ సింగరేణి గనుల్లో సపోర్ట్ మన్ గా పనిచేస్తున్నారు. ఆయన కుమార్తె శిరీష వివాహం జూన్ 9న జరగాల్సి ఉంది. కుమార్తె పెళ్లి కోసం సింగరేణి గార్డెన్స్ ఫంక్షన్ హాల్ ను ముందుగానే బుక్ చేశారు. అయితే, ఫంక్షన్ హాల్ నిర్వాహకుల నుంచి వచ్చిన సందేశం ఆయనను దిగ్భ్రాంతికి గురిచేసింది. 

జూన్ 9న సీఎం కేసీఆర్ వస్తున్నారని, పెళ్లికి ఫంక్షన్ హాల్ ఇవ్వలేమని సింగరేణి గార్డెన్స్ నిర్వాహకులు ఫోన్ ద్వారా సత్యనారాయణకు సమాచారం అందించారు. మరో ఫంక్షన్ హాల్ చూసుకోవాలని సలహా ఇచ్చారు. 

జూన్ 9న మంచి ముహూర్తాలు ఉండడంతో ఆ రోజున చాలా వివాహాలు జరగనున్నాయి. శ్రీరాంపూర్, సీసీసీ ఏరియాల్లో ఫంక్షన్ హాల్స్ అన్నీ ముందే బుక్ అయిపోయాయి. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో, వాటి బుకింగ్ కూడా రద్దు చేస్తున్నట్టు తెలుస్తోంది. 

మరికొన్ని రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా, సింగరేణి గార్డెన్స్ నిర్వాహకుల నుంచి వచ్చిన ఫోన్ తో వధువు తండ్రి సత్యనారాయణ దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.

KCR
Singareni Collieries Company
Srirampur
Marriages
Function Halls
  • Loading...

More Telugu News