IPL Trophy: చెన్నై జట్టు గెలిచిన ఐపీఎల్ ట్రోఫీకి ఆలయంలో ప్రత్యేక పూజలు

  • ఐపీఎల్ 16వ సీజన్ విజేతగా చెన్నై సూపర్ కింగ్స్
  • ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ పై 5 వికెట్ల తేడాతో విజయం
  • చెన్నైలోని వెంకటేశ్వరస్వామి ఆలయానికి ట్రోఫీని తీసుకొచ్చిన ఫ్రాంచైజీ యాజమాన్యం
Special offerings to IPL Trophy won by CSK

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ 16వ సీజన్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. రికార్డు స్థాయిలో చెన్నై జట్టు ఐదో ఐపీఎల్ టైటిల్ నెగ్గడంతో తమిళనాట ఉత్సాహభరిత వాతావరణం కనిపిస్తోంది. కాగా, సీఎస్కే గెలిచిన తాజా ఐపీఎల్ ట్రోఫీని ఆ జట్టు యాజమాన్యం నేడు చెన్నై తీసుకువచ్చింది. ఇక్కడి త్యాగరాజ నగర్ లోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఆ ట్రోఫీకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో సీఎస్కే జట్టు యజమాని ఎన్.శ్రీనివాసన్ కూడా పాల్గొన్నారు. ఈ ట్రోఫీని చూసేందుకు ఆలయం వద్దకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. నిన్న జరిగిన ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ ను ఓడించింది.

More Telugu News