Nakka Anand Babu: ప్రజలకు పట్టిన పీడ ఏడాదిలో విరగడ అవుతుంది: నక్కా ఆనంద్ బాబు

Nakka Anand Babu and TDP leaders releases Charge Sheet on four years YCP administration

  • వైసీపీ పాలనపై టీడీపీ చార్జిషీట్
  • చార్జిషీట్ విడుదల చేసిన నక్కా ఆనంద్ బాబు తదితరులు
  • జగన్ ప్రమాణం చేసినప్పుడే రాష్ట్రం అంధకారమైందన్న నక్కా

నాలుగేళ్ల వైసీపీ పాలనపై టీడీపీ చార్జిషీట్ విడుదల చేసింది. మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, పొలిట్ బ్యూరో సభ్యులు చార్జిషీట్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం జగన్ ప్రతి రంగాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేశారో ఈ చార్జిషీట్ లో టీడీపీ వివరించింది. ఈ సందర్భంగా నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ, జగన్ ప్రమాణం చేసినప్పుడే రాష్ట్రం అంధకారమైందని విమర్శించారు. విధ్వంసంతో జగన్ పాలన మొదలైందని అన్నారు. ప్రజలకు పట్టిన పీడ ఏడాదితో విరగడ అవుతుందని, వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. 

బొండా ఉమ మాట్లాడుతూ, చార్జిషీట్ పై సీఎం జగన్ సమాధానం చెప్పాలని నిలదీశారు. సీఎం జగన్ అన్ని రంగాల్లో విఫలమయ్యారని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు.

Nakka Anand Babu
Chargesheet
TDP
Jagan
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News