Telangana: ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం

TSPSC debar 37 students permanently
  • ప్రశ్నపత్రాల లీకేజీతో ప్రమేయం ఉన్న వారు డిబార్‌
  • టీఎస్‌పీఎస్సీ నిర్వహించే ఏ పరీక్ష రాయకుండా నిర్ణయం
  • అభ్యంతరాలుంటే రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని 37 మంది నిందితులకు నోటీసులు
ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో టీఎస్‌పీఎస్సీ (TSPSC) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశ్నపత్రాల లీకేజీతో ప్రమేయం ఉన్న వారిని డిబార్‌ చేయాలని నిర్ణయించింది. సిట్‌ అరెస్టు చేసిన 37 మంది ఇకపై టీఎస్‌పీఎస్సీ నిర్వహించే ఎలాంటి పరీక్షలు రాయకుండా డిబార్ చేయాలని కమిషన్‌ ఆదేశించింది. దీనిపై అభ్యంతరాలుంటే రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని 37 మంది నిందితులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ప్రత్యేక దర్యాప్తు బృందం 44 మందిపై కేసు నమోదు చేయగా 43 మందిని అరెస్ట్ చేసింది.
Telangana
tspsc

More Telugu News