Harish Rao: బీజేపీలో ఎవరూ చేరడం లేదని ఈటల చేతులెత్తేశారు: హరీశ్ రావు

Harish Rao fires at Etala Rajender

  • బీజేపీ పని అయిపోయిందని ఈటల చెప్పారన్న మంత్రి
  • ఈటల చెప్పేది వేదాంతం... చేసేది రాద్ధాంతమని ఎద్దేవా
  • కడుపులో విషం ఉంటుందని వ్యాఖ్య

బీజేపీ పని అయిపోయిందని ఆ పార్టీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ చెప్పకనే చెప్పారని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు మంగళవారం అన్నారు. బీజేపీలో ఎవరూ చేరడం లేదని ఆయన చేతులు ఎత్తేశారన్నారు. ఆయన చెప్పేది వేదాంతం... చేసేది రాద్ధాంతమని ఎద్దేవా చేశారు. ఆయన కడుపులో అంతా విషం అని మండిపడ్డారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు బీజేపీలో చేరడంపై ఇటీవల ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం వంటి జిల్లాల్లో కాంగ్రెస్, కమ్యూనిస్ట్ బలంగా ఉందని ఈటల అన్నారు. పరోక్షంగా బీజేపీలోకి వారు రావడం లేదని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో హరీశ్ రావు ఆయన మాటలపై స్పందించారు.

Harish Rao
Etela Rajender
  • Loading...

More Telugu News