N.Srinivasan: ఈ అద్భుతాన్ని నువ్వు మాత్రమే చేయగలవు: ధోనీతో సీఎస్కే యజమాని శ్రీనివాసన్

CSK owner Srinivasan hails Dhoni for winning fifth IPL title

  • ఐపీఎల్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం
  • ధోనీకి ఫోన్ చేసిన సీఎస్కే యజమాని శ్రీనివాసన్
  • అద్వితీయం కెప్టెన్ అంటూ అభినందనలు
  • చెన్నై వచ్చి విజయోత్సవాల్లో పాల్గొనాలని ఆహ్వానం 

ఐపీఎల్ 16వ సీజన్ టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ పై అభినందనల జడివాన కురుస్తోంది. ఐదో ఐపీఎల్ టైటిల్ గెలిచి ముంబయి ఇండియన్స్ రికార్డు సమం చేసిన ధోనీ సేనకు నీరాజనాలు పడుతున్నారు. 

కాగా, చెన్నై సూపర్ కింగ్స్ యజమాని, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ ధోనీసేన విజయంపై స్పందించారు. ధోనీకి ఫోన్ చేసి ఐపీఎల్ ఫైనల్లో విజయంపై అభినందించారు. 

"అద్వితీయం కెప్టెన్... నువ్వు నిజంగా అద్భుతం చేశావు. నీకు మాత్రమే ఇది సాధ్యం. కుర్రాళ్ల ఆట పట్ల, జట్టుగా ప్రదర్శన పట్ల గర్విస్తున్నాం" అంటూ ధోనీతో ఫోన్ కాల్ లో శ్రీనివాసన్ హర్షం వ్యక్తం చేశారు. 

అంతేకాదు, జట్టుతో సహా చెన్నై చేరుకుని విజయోత్సవాల్లో పాల్గొనాలని కూడా ధోనీని శ్రీనివాసన్ ఆహ్వానించారు. వరుసగా మ్యాచ్ లు ఆడి అలసిపోయిన ధోనీని విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.  

ధోనీని అభిమానులు ఎంతగా ప్రేమిస్తున్నారో చెప్పేందుకు ఈ ఐపీఎల్ సీజన్ ఓ నిదర్శనంలా నిలిచిపోతుందని తెలిపారు. ధోనీకి తాము కూడా అభిమానులమేనని శ్రీనివాసన్ ఉద్ఘాటించారు.

N.Srinivasan
MS Dhoni
CSK
IPL
  • Loading...

More Telugu News