Balakrishna: 'భగవత్ కేసరి'గా బాలయ్య విజృంభణ?

  • షూటింగు దశలో బాలయ్య 108వ సినిమా 
  • మాస్ యాక్షన్ తోనే నడిపిస్తున్న అనిల్ రావిపూడి 
  • జూన్ 10వ తేదీన టైటిల్ పోస్టర్ రిలీజ్ 
  • దసరాకి సినిమాను విడుదల చేసే ఛాన్స్  
Balayya movie upadate

బాలకృష్ణ కథానాయకుడిగా ఆయన 108వ సినిమా రూపొందుతోంది. సాహు గారపాటి - హరీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. బాలయ్య సరసన నాయికగా తమన్నా నటిస్తుంటే, ఆయన కూతురుగా శ్రీలీల కనిపించనుంది.

ఈ సినిమాకి ఇంతవరకూ టైటిల్ ను ఖరారు చేయలేదు. బాలయ్య సినిమా అంటే టైటిల్ చాలా పవర్ఫుల్ గా ఉండాలి .. లేదంటే అభిమానులు ఒప్పుకోరు. అందువలన బాగా ఆలోచన చేసి, కథను బట్టి ఈ సినిమాను 'భగవత్ కేసరి' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా సమాచారం. 'ఐ డోంట్ కేర్' అనేది ట్యాగ్ లైన్. ఆల్రెడీ ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించినట్టుగా తెలుస్తోంది. 

జూన్ 10వ తేదీన బాలకృష్ణ పుట్టినరోజు. ఆ సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను ఎనౌన్స్ చేయనున్నట్టుగా చెబుతున్నారు. టైటిల్ కి తగిన ఈ పాత్రలో బాలయ్య విజృంభణ ఒక రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. బాలయ్య మార్క్ మాస్ యాక్షన్ తోనే ఈ సినిమా నడుస్తుందని అనిల్ రావిపూడి ఎప్పుడో క్లారిటీ ఇచ్చేశాడు. దసరాకి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 

More Telugu News