Honey Rose: హనీరోజ్ జాడ ఏది? ఆమె కోసం వెయిట్ చేస్తున్న కుర్రకారు!

  • 'వీరసింహారెడ్డి'తో ఎంట్రీ ఇచ్చిన హనీ రోజ్ 
  • గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసిన సుందరి 
  • ఆమె జోరు కొనసాగడం ఖాయమనుకున్న ఫ్యాన్స్
  • ఆ స్థాయిలో ఆమె పేరు వినిపించకపోవడంతో నిరాశ  
Honey Rose Special

తెలుగులో సీనియర్ స్టార్ హీరోల సరసన నాయిక అంటే గతంలో అనుష్క .. నయనతార .. త్రిష .. కాజల్ వంటివారు కనిపించేవారు. ఆ తరువాత అనుష్క సినిమాల సంఖ్యను పూర్తిగా తగ్గించివేసింది. నయనతార .. త్రిష ఎక్కువగా తమిళ సినిమాలపైనే ఫోకస్ చేస్తున్నారు .. అందునా నాయిక ప్రధానమైన కథలవైపునే దృష్టి పెడుతున్నారు. ఇక కాజల్ కూడా వ్యక్తిగత కారణాల వలన కాస్త స్పీడ్ తగ్గించింది. 

ఇలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలకు జోడీ సెట్ చేయడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే అంతగా మార్కెట్ లేని భామలను రంగంలోకి దింపడం మొదలెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో 'వీరసింహా రెడ్డి' సినిమా కోసం, హనీ రోజ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో బాలయ్య సరసన ఆమె అదరగొట్టేసింది. గ్లామర్ పరంగా మాస్ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేసింది. 

ఇంతకాలంగా ఈ సుందరి ఏమైపోయిందబ్బా అనుకున్న కుర్రాళ్లంతా, ఇక ఆమె జోరు కొనసాగడం ఖాయమని అనుకున్నారు. రానున్న స్టార్ హీరోల సినిమాల జాబితాలో ఆమె పేరు తప్పకుండా ఉంటుందని భావించారు. కానీ క్లాప్ వరకూ వెళ్లిన ఏ తెలుగు ప్రాజెక్టులోను ఆమె పేరు కనిపించడం లేదు. కారణం ఏమిటనేది తెలియడం లేదు. కుర్రాళ్లు మాత్రం ఆమెను సాధ్యమైనంత త్వరగా తెరపై చూడాలనే ఆరాటంతో కనిపిస్తున్నారు. 

More Telugu News