Chandrababu: జగన్ నాలుగేళ్ల పాలనపై చంద్రబాబు సెటైరికల్ ట్వీట్

Chandrababu satirical tweet on Jagans four years ruling

  • నేటితో నాలుగేళ్ల పాలనను పూర్తి చేసుకున్న జగన్
  • ఏపీ విధ్వంసం ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమయిందన్న చంద్రబాబు
  • ఐదో ఏడాది కూడా విధ్వంసం కొనసాగుతోందని విమర్శ

ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ నాలుగేళ్ల పాలనను పూర్తి చేసుకున్నారు. నాలుగేళ్ల క్రితం ఇదే రోజున సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులు వేడుకలు జరుపుకుంటుండగా... విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ సెటైరికల్ గా ట్వీట్ చేశారు. 

జగన్ సీఎం అయిన వెంటనే అమరావతిలోని ప్రజావేదికను కూల్చి వేసిన సంగతి తెలిసిందే. అధికారులతో సమావేశం సందర్భంగా జగన్ మాట్లాడుతూ... తొలి కూల్చివేత ఈ బిల్డింగ్ తో ప్రారంభమవుతుందని అన్నారు. దీనికి సంబంధించిన వీడియోను చంద్రబాబు షేర్ చేశారు. 'నిజమే. తొలి రోజు మీరు ఏం చెప్పారో మీ ప్రభుత్వం దాన్నే తు.చ తప్పకుండా అమలు చేస్తోంది. ఏపీ విధ్వంసం ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమయింది... ఆ విధ్వంసం ఐదో ఏడాది కూడా కొనసాగుతోంది' అని చంద్రబాబు అన్నారు. దీంతోపాటు ప్రజావేదికను కూల్చుతున్న వీడియోను కూడా షేర్ చేశారు.

Chandrababu
Telugudesam
Jagan
YSRCP
  • Loading...

More Telugu News