Apoorva Lakhia: రామ్ చరణ్ తో విభేదాలంటూ జరుగుతున్న ప్రచారంపై అపూర్వ లఖియా స్పందన

Apoorva Lakhia opines about his bonding with Ram Charan

  • 2013లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్
  • అపూర్వ లఖియా దర్శకత్వంలో జంజీర్ చిత్రం
  • పరాజయం చవిచూసిన చిత్రం
  • ఈ సినిమా తర్వాత అపూర్వను రామ్ చరణ్ దూరం పెట్టాడంటూ ప్రచారం 

అప్పట్లో రామ్ చరణ్ ఓ బాలీవుడ్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్ గ్రేటెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచే జంజీర్ చిత్రాన్ని అదే పేరుతో రామ్ చరణ్ హీరోగా, అపూర్వ లఖియా దర్శకత్వంలో రీమేక్ చేశారు. ఇందులో ప్రియాంక చోప్రా కథానాయిక. తెలుగులో ఈ సినిమా తూఫాన్ పేరిట వచ్చింది. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. దాంతో దర్శకుడు అపూర్వ లఖియాను రామ్ చరణ్ దరిదాపుల్లోకి కూడా రానివ్వడంలేదన్న ప్రచారం జరిగింది. 

దీనిపై దర్శకుడు అపూర్వ లఖియా తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. రామ్ చరణ్ కు, తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ తన ఫోన్ కాల్ కు జవాబు ఇవ్వడంలేదని, అతడు సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడని వెల్లడించారు.

రామ్ చరణ్ కు ఎక్కువగా ఫోన్ కాల్స్ కు జవాబిచ్చే అలవాటు లేదని, రామ్ చరణ్ కు వచ్చే కాల్స్ కు ఉపాసన సమాధానమిస్తుంటుందని వివరించారు. జంజీర్ సినిమా తర్వాత కూడా రామ్ చరణ్ తో స్నేహం కొనసాగిందని, హైదరాబాదు వెళ్లినప్పుడు వాళ్లింట్లో చాలా రోజులు ఉన్నానని అపూర్వ లఖియా వెల్లడించారు. తాను ఇప్పుడు హైదరాబాద్ వెళ్లినా రామ్ చరణ్ తనను కలుస్తాడని పేర్కొన్నారు. 

ఆర్ఆర్ఆర్ చిత్రం ఉక్రెయిన్ లో షూటింగ్ జరుపుకుంటున్న సమయంలో రామ్ చరణ్ తనకు ఫోన్ చేసి, యాక్షన్ సీక్వెన్స్ ల గురించి చర్చించాడని తెలిపారు.

Apoorva Lakhia
Ram Charan
Zanjeer
Bollywood
Tollywood
  • Loading...

More Telugu News