Miryala Raveendar Reddy: 'అఖండ' నిర్మాత నుంచి మరో భారీ సినిమా!

Miryala Raveendar Reddy new movie update

  • 'అఖండ'తో విజయాన్ని అందుకున్న మిర్యాల రవీందర్ రెడ్డి
  •  మరో భారీ ప్రాజెక్టుకి సంబంధించి జరుగుతున్న పనులు 
  • దర్శకుడిగా శ్రీకాంత్ అడ్డాలకి ఛాన్స్ 
  • జూన్ 2వ తేదీన టైటిల్ తో కూడిన ఫస్టులుక్ రిలీజ్  

బాలకృష్ణ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా 'అఖండ' నిలిచింది. ఆయన చేసిన వైవిధ్యభరితమైన చిత్రాలలో ముందువరుసలో చేరింది. బాలకృష్ణ మాస్ యాక్షన్ కి దైవత్వాన్ని ఆపాదించడం వలన ఈ సినిమా వసూళ్ల పరంగా కొత్త రికార్డులను నమోదు చేసింది. అలాంటి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించిన నిర్మాతనే మిర్యాల రవీందర్ రెడ్డి 

'అఖండ' సినిమా సీక్వెల్ కి తాను సిద్ధంగా ఉన్నానని చెబుతూ వస్తున్న ఆయన, అందుకు ఇంకా సమయం ఉండటంతో, మరో భారీ బడ్జెట్ సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు. ఈ సినిమాకి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించనున్నాడు. ఇంతవరకూ ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. జూన్ 2వ తేదీన టైటిల్ తో కూడిన ఫస్టులుక్ ను 11:39 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కొంతసేపటి క్రితం వదిలారు. 

ఫ్యామిలీ ఎమోషన్స్ ను తెరకెక్కించడంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు శ్రీకాంత్ అడ్డాలకి ఉంది. అయితే 'బ్రహ్మోత్సవం' సినిమా ఫ్లాప్ అతని కెరియర్ పై బాగా ప్రభావం చూపించింది. దాని నుంచి తేరుకుని అతను 'నారప్ప' సినిమాతో హిట్ కొట్టడానికి కొంత సమయం పట్టింది. ఇక మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో చేయనున్న సినిమా గురించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Miryala Raveendar Reddy
Srikanth Addala
Tollywood
  • Loading...

More Telugu News