Virat Kohli: ఐపీఎల్ తుది ఫలితంపై కోహ్లీ చక్కని ట్వీట్.. ఇతర క్రికెటర్లు కూడా..!

Virat Kohli to Robin Uthappa cricketers react as Chennai Super Kings win 5th title virat kohli to robin uthappa cricketers react as chennai super kings win 5th title

  • సీఎస్కే గొప్పగా ఆడిందంటూ కితాబు
  • జడేజా, ధోనీ పట్ల ప్రశంసలు
  • ఇలాంటి మరిన్ని విజయాలు అందుకోవాలన్న ఆకాంక్ష

ఐపీఎల్ టైటిల్ ను చెన్నై సూపర్ కింగ్స్ ఎగరేసుకుపోవడం పట్ల ప్రముఖ క్రికెటర్లు తమ స్పందన వ్యక్తం చేశారు. విరాట్ కోహ్లీ నుంచి వీరేంద్ర సెహ్వాగ్ వరకు ఎంతో మంది ట్విట్టర్ లో ట్వీట్లు పెట్టారు.

‘‘ఎంత గొప్ప విజయం. జడ్డూ నీవు చాలా అందంగా ఆడావు. రాయుడు, రహానే, దూబే తమ వంతు కృషి చేశారు. మోహిత్ అద్భుతం. కానీ, అసాధ్యమనుకున్న సందర్భాల్లో ఎలా గెలవాలో చెన్నైకి తెలుసు’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు. 

‘‘సీఎస్కే గొప్పగా ఆడింది. రాయుడు రిటైరవ్వడానికి ఇదే మార్గం. నీవు ఎంత గొప్ప ఆటగాడివో’’ అంటూ మరో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసించాడు.  

ఇక సీఎస్కే మాజీ ఆటగాడు, ధోనీ సన్నిహితుడు సురేష్ రైనా స్పందిస్తూ.. ‘‘సీఎస్కే అనే ఈ గొప్ప కుటుంబంలో భాగం అయినందుకు ఎంతో గర్విస్తున్నాను. ఈ విజయం అద్భుతమైన ప్రయాణానికి పరాకాష్ఠ. మరిన్ని విజయాలు చేకూరాలని కోరుకుంటున్నాను’’ అని ట్వీట్ చేశాడు. 

సీఎస్కే మరో ఆటగాడు రాబిన్ ఊతప్ప తన ట్వీట్ లో.. ‘‘ఈ ఐపీఎల్ సీజన్ కు ఎంత గొప్ప ముగింపు. ఎంతో థ్రిల్. సీఎస్కేకు జడేజా చక్కని విజయాన్నిచ్చాడు. చెన్నైకి గొప్ప అభినందనలు’’ అని పేర్కొన్నాడు.

Virat Kohli
Robin Uthappa
Virender Sehwag
react
Chennai Super Kings
win
  • Loading...

More Telugu News