Chiranjeevi: 'భోళాశంకర్' పాటల సందడికి వేళైంది!

Chiranjeevi Bhola Shankar music mania begins soon

  • చిరంజీవి, తమన్నా జంటగా భోళాశంకర్
  • చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్
  • మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళాశంకర్
  • సంగీతం అందిస్తున్న మహతి స్వరసాగర్
  • ఆగస్టు 11న వరల్డ్ వైడ్ రిలీజ్ 

మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేశ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం భోళాశంకర్. ఇందులో తమన్నా కథానాయిక కాగా, చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ నటిస్తోంది. తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ ఆసక్తికర అప్ డేట్ ఇచ్చింది. 

ఇక భోళాశంకర్ పాటల సందడికి వేళైందని వెల్లడించింది. త్వరలోనే భోళాశంకర్ పాటలు అభిమానుల ముందుకు తీసుకువస్తామని వివరించింది. భోళాశంకర్ మెగా మ్యూజిక్ మేనియా వచ్చేస్తోందంటూ మెగా ఫ్యాన్స్ కు తియ్యని కబురు చెప్పింది. భోళాశంకర్ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Chiranjeevi
Bhola Shankar
Songs
Mahati Swara Sagar
Meher Ramesh
  • Loading...

More Telugu News