Lorry Driver: లారీ డ్రైవర్ కు గుండెపోటు.. ఆగి వున్న కారును ఢీకొట్టిన వైనం

Driver got heart attack while driving and lorry hits car in Hyderabad

  • ప్రొ.జయశంకర్ వర్సిటీ దగ్గర్లో ప్రమాదం
  • లారీతో పాటు కారుకి డ్యామేజీ 
  • కారులో ఉన్నవారికి స్వల్ప గాయాలు

హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్ లో సోమవారం ఓ లారీ బీభత్సం సృష్టించింది. డ్రైవర్ కు గుండెపోటు రావడంతో లారీపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో హైవే పక్కన ఆగి ఉన్న ఓ కారును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారుతో పాటు లారీ డ్యామేజ్ కాగా కారులో ఉన్నవారికి స్వల్పంగా గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ మాత్రం గుండెపోటు కారణంగా చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

కర్నూలు నుంచి ధాన్యం లోడును లారీ హైదరాబాద్ కు తీసుకు వస్తోంది. ఈ క్రమంలో రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ కళాశాల దగ్గరికి రాగానే డ్రైవర్ గుండెపోటుకు గురయ్యాడు. లారీపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో రోడ్డు పక్కనే ఉన్న ఓ కారును ఢీకొట్టి లారీ ఆగింది. డ్రైవర్ ను కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఆసుపత్రికి తీసుకెళ్లగా.. గుండెపోటు కారణంగా అప్పటికే చనిపోయాడని డ్రైవర్ ను పరీక్షించిన వైద్యులు తెలిపారు.

Lorry Driver
Hyderabad
Road Accident
lorry driver heart attack
  • Loading...

More Telugu News