IPL 2023: 16 కోట్లు పెట్టి కొన్న ప్లేయర్ సీజన్ మొత్తానికీ చేసింది 15 పరుగులే!

Ben Stokes Charged Rs 1 Crore For 1 Run In This Season

  • బెన్ స్టోక్స్ ను కొనేందుకు భారీ మొత్తం వెచ్చించిన సీఎస్కే యాజమాన్యం
  • కాలి నొప్పితో బెంచ్ కే పరిమితమైన స్టోక్స్.. సీజన్ లో ఆడింది రెండు మ్యాచ్ లే
  • సీజన్ లోనే అత్యంత చెత్త ప్లేయర్ అంటూ మండిపడుతున్న అభిమానులు

స్టార్ ఆల్ రౌండర్ గా పేరుపొందడంతో ఐపీఎల్ 2023 వేలంలో భారీ ధర పలికాడు.. టీ20 వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రదర్శన చూసి సీఎస్కే యాజమాన్యం భారీ మొత్తం వెచ్చించి సదరు ఆటగాడిని సొంతం చేసుకుంది.. జట్టుకు ట్రోపీ అందిస్తాడని ఆశలు పెట్టుకుంది. అయితే, రూ.16 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఆ ఆటగాడు ఈ సీజన్ మొత్తానికీ ఆడింది రెండు మ్యాచ్ లే, చేసింది 15 పరుగులే. ఒక ఓవర్ బౌలింగ్ వేసి 18 పరుగులు ప్రత్యర్థి జట్టుకు సమర్పించుకున్నాడు. ఆ ఆటగాడు మరెవరో కాదు.. ఇంగ్లాడ్ ప్లేయర్ బెన్ స్టోక్స్.

వేలంలో స్టోక్స్ ను రూ.16.25 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసింది. జట్టుకు అండగా ఉంటాడని భావించింది. అయితే, కాలినొప్పి కారణంగా బెన్ స్టోక్స్ ఎక్కువగా బెంచ్ కే పరిమితమయ్యాడు. లీగ్ స్టేజ్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కనీసం ప్లేఆఫ్స్ కైనా అందుబాటులో ఉంటాడని అనుకుంటే అదీ లేదు. జూన్ 16 నుంచి ప్రారంభం కానున్న యాషెస్ పోరుకు సిద్ధమవ్వాలని ఇంగ్లాండ్ వెళ్లిపోయాడు.

ఈ సీజన్ లో ఈ స్టార్ ఆటగాడు కేవలం రెండు మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. అందులో 15 పరుగులు చేయగా.. ఒక ఓవర్ బౌలింగ్ వేసి 18 పరుగులు ఇచ్చాడు. బెన్ స్టోక్స్ ప్రదర్శనపై సీఎస్కే అభిమానులు మండిపడుతున్నారు. పదిహేను కోట్లు తీసుకుని కనీసం పదహారు పరుగులు కూడా చేయలేదని విమర్శిస్తున్నారు. ఒక్కో పరుగుకు రూ.కోటి చొప్పున తీసుకున్నాడని తిట్టిపోస్తున్నారు.

IPL 2023
Ben stokes
england
Cricket
alrounder
  • Loading...

More Telugu News