Allu Arjun: అల్లు అర్జున్ తొలి గర్ల్ ఫ్రెండ్ భార్య స్నేహ కాదట.. ఎవరో చెప్పిన బన్నీ!

Allu Arjun reveals his first girl friend name
  • స్నేహారెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్న అల్లు అర్జున్
  • తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ - 2కు గెస్ట్ గా వచ్చిన బన్నీ
  • తన తొలి గర్ల్ ఫ్రెండ్ పేరు శ్రుతి అని వెల్లడి
స్నేహారెడ్డిని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయిన వీరు ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. వీరికి అయాన్ అనే కొడుకు, అర్హ అనే కూతురు ఉన్నారు. అన్యోన్య దాంపత్యానికి చిరునామా అన్నట్టుగా వీరి ఫ్యామిలీ లైఫ్ సంతోషంగా కొనసాగుతోంది. 

మరోవైపు తాజాగా బన్నీ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. తన ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ స్నేహ కాదని తెలిపాడు. ఆహాలో ప్రసారమవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ - 2 ఫైనల్స్ కు బన్నీ గెస్టుగా విచ్చేశాడు. కంటెస్టెంట్లలో శ్రుతి అనే అమ్మాయి పాట పాడిన తర్వాత బన్నీ మాట్లాడుతూ.... నీ పేరు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాడు. ఎందుకంటే తన ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరు కూడా శ్రుతినే అని తెలిపాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Allu Arjun
First Girl Friend
Tollywood

More Telugu News