Jagan: 'నిర్మల్ హృదయ్' భవన్ కు వెళ్లిన వైఎస్ జగన్, భారతి.. వీడియో ఇదిగో

  • విజయవాడలోని నిర్మల్ హృదయ్ కి వెళ్లిన జగన్ దంపతులు
  • నూతన భవనం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి
  • అనాథ పిల్లలతో ముచ్చటించిన జగన్, భారతి
Jagan and YS Bharathi went to Nirmal Hriday

ఏపీ ముఖ్యమంత్రి జగన్ విజయవాడలోని మిషనరీస్ ఆఫ్ ఛారిటీ నిర్మల్ హృదయ్ భవనానికి వెళ్లారు. నిర్మల్ హృదయ్ నూతన భవనం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనాథ పిల్లలతో జగన్ దంపతులు ముచ్చటించారు. పిల్లల యోగక్షేమాల గురించి అక్కడున్న నన్స్ ను అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

మరోవైపు నేటితో సీఎంగా జగన్ నాలుగేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వైసీపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతర కీలక నేతలు జెండా ఎగురవేశారు. సజ్జల కేక్ కట్ చేశారు.

More Telugu News