Ravindra Jadeja: సీఎస్కే గెలవగానే జడేజా భార్య కళ్లల్లో ఆనందబాష్పాలు.. వీడియో ఇదిగో!

Ravindra Jadeja Wife In Tears After Star All rounder Wins IPL 2023 Title For CSK

  • ఫైనల్ మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వచ్చిన ఎమ్మెల్యే రివాబా జడేజా
  • చివరి బంతికి ఫోర్ కొట్టి జట్టును గెలిపించిన జడేజా
  • మైదానంలోకి వెళ్లి జడ్డూను ఎత్తుకున్న సీఎస్కే కెప్టెన్ ధోని

వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ను రిజర్వ్ డేకు మార్చిన విషయం తెలిసిందే. అయితే, సోమవారం కూడా వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ జరుగుతుందా లేక గుజరాత్ టైటాన్స్ ను విజేతగా ప్రకటిస్తారా అని ఐపీఎల్ అభిమానుల్లో ఉత్కంఠ కొనసాగింది. వరణుడు శాంతించడంతో డక్ వర్త్ లూయిస్ మెథడ్ ప్రకారం మ్యాచ్ ను కుదించారు. పదిహేను ఓవర్లలో 171 పరుగుల లక్ష్యాన్ని నిర్ణయించారు. చివరి బాల్ వరకూ కొనసాగిన ఉత్కంఠ పోరుకు జడేజా ఫోర్ బాది తెరదించాడు. రెండు బంతుల్లో పది పరుగులు చేయాల్సి ఉండగా.. ఓ సిక్స్, ఫోర్ బాది చెన్నై సూపర్ కింగ్స్ ను విజేతగా నిలిపాడు.

ఫైనల్ మ్యాచ్ చూసేందుకు ఆటగాళ్ల కుటుంబ సభ్యులు కూడా నరేంద్ర మోదీ స్టేడియానికి వచ్చారు. సీఎస్కే ఆటగాడు రవీంద్ర జడేజా భార్య, జామ్ నగర్ నార్త్ ఎమ్మెల్యే రివాబా జడేజా కూడా ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చారు. చివరి బంతికి జడేజా బౌండరీ బాదడంతో రివాబా సంతోషంతో కన్నీటిపర్యంతమయ్యారు. ఆనందబాష్పాలతో చప్పట్లు చరుస్తూ భర్త జడేజాను, సీఎస్కే ఆటగాళ్లను అభినందించారు. రివాబా కళ్లల్లో ఆనందబాష్పాలను కెమెరా రికార్డు చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు, అభిమానులు మిస్టర్ కూల్ గా పిలుచుకునే మహేంద్ర సింగ్ ధోనీ కూడా గ్రౌండ్ లోకి వెళ్లి జడేజాను ఎత్తుకుని అభినందించాడు.

Ravindra Jadeja
Rivaba jadeja
BJP Mla
IPL 2023
CSK
MS Dhoni
  • Loading...

More Telugu News