New Delhi: బ్రేకప్ చెప్పిందనే ఢిల్లీ టీనేజ్ యువతి హత్య..!

Anger over breakup drove sahil to kill sakshi
  • ఢిల్లీ యువతి హత్య కేసులో పోలీసుల ప్రాథమిక అంచనా
  • యువతి బ్రేకప్ చెప్పిందని నిందితుడికి తీవ్ర ఆగ్రహం
  • ఆమెను హత్య చేసినందుకు తనకు పశ్చాత్తాపం లేదన్న నిందితుడు
ఢీల్లీలో టీనేజ్ యువతి హత్యకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. గర్ల్‌ఫ్రెండ్ బ్రేకప్ చెప్పడంతో కోపోద్రిక్తుడైన నిందితుడు ఆమెను హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో 16 ఏళ్ల సాక్షి అనే టీనేజర్‌ను ఆమె బాయ్‌ఫ్రెండ్ సాహిల్ దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. నడివీధిలో ఆమెను 20 సార్లు కత్తితో పొడిచి, ఆపై బండరాయితో నెత్తిపై మోది చంపేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. 

‘‘2021 నుంచి వారి మధ్య రిలేషన్ షిప్ ఉంది. సాక్షి అతడితో బంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకుంది. హత్యకు ఓ రోజు ముందే వారి మధ్య మాటలు పూర్తిగా నిలిచిపోయాయి. కానీ, మళ్లీ ఒక్కటవుదామంటూ ఆమెను సాహిల్ పదే పదే కోరాడు’’ అని పోలీసులు తెలిపారు. సాక్షిని చంపినందుకు తనకేమీ పశ్చాత్తాపం లేదని కూడా నిందితుడు పోలీసులకు చెప్పాడు.
New Delhi
Crime News

More Telugu News