Tamil Nadu: నన్ను సీఎంని చేయండి.. మీకో అద్భుతమైన రహస్యం చెబుతా: నటుడు శరత్ కుమార్

I will live upto 150 years says veteran Tamil actor Sarathkumar

  • తన వయసు 69 సంవత్సరాలైనా 25 ఏళ్ల యువకుడిలా కనిపిస్తానన్న శరత్‌కుమార్
  • 150 ఏళ్లు జీవించే రహస్యం కనుగొన్నానన్న నటుడు
  • 2026 ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఆ రహస్యం చెబుతానని వెల్లడి

కోలీవుడ్ ప్రముఖ నటుడు, ఎస్ఎంకే చీఫ్ శరత్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మదురై పళంగానత్తంలో నిన్న అఖిల భారత సమత్తువ మక్కల్ కట్చి ఏడో బహిరంగ సభ జరిగింది. శరత్ కుమార్  మాట్లాడుతూ..  తన వయసు ప్రస్తుతం 69 సంవత్సరాలని, కానీ 25 ఏళ్ల యువకుడిలా కనిపిస్తానని చెప్పారు. 150 ఏళ్ల వరకు జీవించే రహస్యం తనకు తెలుసని పేర్కొన్నారు. 2026 ఎన్నికల్లో తనను గెలిపించి ముఖ్యమంత్రిని చేస్తే ఆ రహస్యం చెబుతానని పేర్కొన్నారు. 

శరత్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను కుదిపేస్తున్నాయి. నెటిజన్లు అప్పుడే మీమ్స్‌తో సోషల్ మీడియాను ముంచెత్తుతున్నారు. మద్యం దేహాన్ని నాశనం చేసి మానసిక ఒత్తిడికి కారణం అవుతోందని ఆవేదన వ్యక్తం చేసిన శరత్ కుమార్..  2025 నాటికి అత్యధిక యువకులతో కూడిన దేశంగా భారత్ అవతరిస్తుందని గణాంకాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. దేశంలో యువశక్తిని నియంత్రించేందుకే విదేశాల నుంచి మత్తు పదార్ధాలను అక్రమంగా రవాణా చేస్తున్నట్టు ఆరోపించారు. రాష్ట్రంలో మద్య నిషేధం విధించాలని ప్రభుత్వాన్ని శరత్ కుమార్ కోరారు.

Tamil Nadu
Sarathkumar
Samathuva Makkal Katchi
  • Loading...

More Telugu News