Vaishno Devi Temple: వైష్ణోదేవి ఆలయానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. 8 మంది దుర్మరణం

8 killed and 20 injured as bus going to Vaishno Devi skids off bridge

  • అమృత్‌సర్ నుంచి కత్రా వెళ్తున్న బస్సు
  • బ్రిడ్జిపై నుంచి జారిపడి లోయలో పడిన బస్సు
  • మరో 20 మందికి గాయాలు

వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్తుండగా జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. అమృత్‌సర్ నుంచి కత్రా వెళ్తున్న బస్సు జమ్మూ జిల్లాలోని జజ్జర్ కోట్లీ ప్రాంతంలో బ్రిడ్జిపై అదుపుతప్పి లోయలో పడింది. 

ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది గాయపడగా వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. స్థానికులతో కలిసి సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నట్టు జమ్మూ సీనియర్ ఎస్పీ చందన్ కోహ్లీ తెలిపారు. క్షతగాత్రులను జమ్మూలోని జీఎంసీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Vaishno Devi Temple
Jammu And Kashmir
Road Accident
  • Loading...

More Telugu News