Tammineni Sitaram: బ్లాక్ క్యాట్ కమాండోలు లేకుంటే చంద్రబాబు ఫినిష్.. స్పీకర్ తమ్మినేని వివాదాస్పద వ్యాఖ్యలు

AP Speaker Tammineni Controversial Comments On Chandrababu

  • చంద్రబాబుకు బ్లాక్ క్యాట్ కమాండోలు ఎందుకని ప్రశ్నించిన తమ్మినేని
  • వారు ఉన్నారన్న ధైర్యంతోనే ఆయన మాట్లాడుతున్నారన్న స్పీకర్
  • జడ్ ప్లస్ భద్రతను ఉపసంహరించాలని కేంద్రాన్ని కోరుతానన్న సీతారాం

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో నిన్న వైసీపీ కార్యకర్తలతో కలిసి నిర్వహించిన బైక్ ర్యాలీలో  తమ్మినేని పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుకు ఉన్న బ్లాక్ కమాండోల భద్రతను తీసేస్తే ఫినిష్ అయిపోతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

వారు ఉన్నారన్న ధైర్యంతోనే ఆయన మాట్లాడుతున్నారని, ఎవరిని ఉద్ధరించడానికి ఆయనకు బ్లాక్ క్యాట్ కమాండోల భద్రత అని ప్రశ్నించారు. ఆయనకున్న భద్రతను ఉపసంహరించాలని స్పీకర్ హోదాలో కేంద్రాన్ని కోరుతానని తెలిపారు. జెడ్ ప్లస్ క్యాటగిరీ భద్రతకు ఆయన ఏ విధంగా అర్హులని నిలదీశారు. దేశంలో చాలామంది నాయకులకు ముప్పు పొంచి వుందని, వారందరికీ ఈ స్థాయి భద్రత కల్పిస్తారా? అని తమ్మినేని ప్రశ్నించారు.

Tammineni Sitaram
Chandrababu
Z-Plus Security
TDP
  • Loading...

More Telugu News