Andhra Pradesh: ఏపీ సీఎస్ కు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం వినతి పత్రం

Govt employees letter to AP CS Jawahar Reddy
  • 160 డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేత
  • మే 22 నుండి తలపెట్టిన ఆందోళనల వివరాలను అందించిన ఉద్యోగులు
  • డిమాండ్లపై స్పందించే వరకు ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టత
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు సోమవారం సీఎస్ జవహర్ రెడ్డిని కలిశారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆయనకు అందించారు. ప్రభుత్వ సంఘం నేతలు సూర్యనారాయణ, ఆస్కార్ రావు కలిసి 160 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు.   మే 22 నుండి చేయాలని తలపెట్టిన దశలవారీ ఆందోళనల వివరాలను సీఎస్ కు వివరించారు. సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాప్ కౌన్సిల్ భేటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లపై ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళనలు కొనసాగుతాయని సీఎస్ కు తెలిపారు.
Andhra Pradesh
employees

More Telugu News