Vineet Tiwary: ప్రేమలో మోసపోయాడు... అప్పటి నుంచి..!

Rewa man starts Bewafa Samosa shop after cheated by lover

  • ప్రేమలో ఓడిపోయిన మధ్యప్రదేశ్ కి చెందిన వినీత్ తివారీ 
  • ప్రియురాలి మోసంతో లవ్ కు బ్రేకప్
  • రేవా పట్టణంలో నమ్మకద్రోహి పేరుతో ఓ సమోసా దుకాణం ప్రారంభం
  • లవర్స్ కు డిస్కౌంట్ ఇస్తోన్న తివారీ

ప్రేమలో కొందరు విజయం సాధిస్తారు, మరికొందరు విఫలమవుతారు. ప్రపంచంలో భగ్నప్రేమికులకు కొదవలేదు. ప్రియురాళ్ల చేతిలో మోసపోయిన వారు కూడా ఉంటారు. వినీత్ తివారీ కూడా ఆ కోవలోకే వస్తాడు. మధ్యప్రదేశ్ లోని రేవా పట్టణానికి చెందిన వినీత్ తివారీ కొన్నాళ్ల కిందట ప్రియురాలి చేతిలో వంచనకు గురయ్యాడు. 

చాలామంది భగ్నప్రేమికులు మనోవేదనకు గురై డిప్రెషన్ లోకి వెళుతుంటారు. కానీ, తివారీ మాత్రం ధైర్యంగా జీవితంలో ముందడుగు వేశాడు. ప్రేమలో ఓడిపోయి, ప్రైవేటు ఉద్యోగాన్ని కూడా కోల్పోయినప్పటికీ కుంగిపోలేదు. వినూత్నరీతిలో తన ప్రస్థానాన్ని కొనసాగించాడు. 

ప్రియురాలిపై కసితో ఓ సమోసా స్టాల్ ప్రారంభించాడు. దాని పేరు బేవఫా సమోసా వాలా. బేవఫా అంటే నమ్మకద్రోహి అని అర్థం. తన సమోసా దుకాణానికి ఆ పేరే పెట్టాడు. అంతేకాదు, ప్రేమికులకు తన దుకాణంలో సమోసాలు కొంటే డిస్కౌంట్ కూడా ఇస్తాడు. రేవా పట్టణంలోని ఆదిత్య హోటల్ కు సమీపంలో తివారీ సమోసా దుకాణం కనిపిస్తుంది.

Vineet Tiwary
Rewa
Love
Cheating
Bewafa Samosa Wala
Madhya Pradesh
  • Loading...

More Telugu News