Novak Djokovic: ఫ్రెంచ్ ఓపెన్ లో జకోవిచ్ శుభారంభం

Former world number one Novak Djokovic made good start in French Open

  • ఫ్రెంచ్ ఓపెన్ లో రెండో రోజు ఆట ఫలితాలు
  • కొవాసెవిచ్ పై సులువుగా నెగ్గిన జకో
  • పదో సీడ్ అలియాస్సిమికి తొలి రౌండ్ లోనే చుక్కెదురు
  • అన్ సీడెడ్ ఆటగాడి చేతిలో ఓటమి

మాజీ వరల్డ్ నంబర్ వన్ నొవాక్ జకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ లో శుభారంభం చేశాడు. అలెగ్జాండర్ కొవాసెవిచ్ తో జరిగిన తొలి రౌండ్ పోరులో మూడో సీడ్ జకోవిచ్ 6-2, 6-3, 7-6 (7-1)తో వరుస సెట్లలో నెగ్గాడు. 

తొలి రెండు సెట్లు సునాయాసంగా గెలిచిన జకోవిచ్ కు మూడో రౌండ్ లో యువ ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైంది. ఆ సెట్ టైబ్రేకర్ లోకి వెళ్లగా, జకో తన అనుభవాన్ని చూపించి 7-1తో ఆ సెట్ ను, తద్వారా మ్యాచ్ లో విజయాన్ని కైవసం చేసుకున్నాడు. 

పురుషుల సింగిల్స్ విభాగంలో మరో తొలి రౌండ్ మ్యాచ్ లో పదో సీడ్ ఫెలిక్స్ ఆగర్ అలియాస్సిమి ఓటమిపాలయ్యాడు. అలియాస్సిమి 4-6, 4-6, 3-6తో అన్ సీడెడ్ ఆటగాడు ఫోగ్నిని చేతిలో చిత్తయ్యాడు. 

ఇక, బ్రిటన్ చెందిన కామెరాన్ నోరీ ఐదు సెట్ల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో 7-5, 4-6,3-6, 6-1, 6-4తో బెనోయిట్ పైరేపై నెగ్గి ముందంజ వేశాడు. 18వ సీడ్ డి మినార్, 19వ సీడ్ బటిస్టా అగుట్ కూడా తొలి రౌండ్ ను దాటారు. 

ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో...  16వ సీడ్ కరోనా ప్లిస్కోవా ఓటమిపాలైంది. అమెరికా అమ్మాయి స్లొవానే స్టీఫెన్స్ 6-0, 6-4తో ప్లిస్కోవాపై విజయం సాధించింది. 20వ సీడ్ మాడిసన్ కీస్, 22వ సీడ్ డోనా వెకిక్ కూడా రెండో రౌండ్ చేరారు.

Novak Djokovic
French Open
Singles
First Round
Roland Garros
  • Loading...

More Telugu News