Shivraj Singh Chouhan: 150 సీట్లు గెలుస్తామన్న రాహుల్ గాంధీ... పగటికలలు కనొద్దన్న మధ్యప్రదేశ్ సీఎం

Madhya Pradesh CM counters Rahul Gandhi comments

  • మరికొన్ని నెలల్లో మధ్యప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు
  • విజయంపై ధీమా వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ
  • కాంగ్రెస్ నేతలు ఊహాలోకంలో విహరిస్తున్నారన్న శివరాజ్ సింగ్ చౌహాన్
  • బీజేపీకి 200కి పైగా సీట్లు వస్తాయని వెల్లడి

మధ్యప్రదేశ్ లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవలే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్... ఇతర రాష్ట్రాల్లోనూ అదే ఫలితాలు పునరావృతం అవుతాయని ధీమాతో ఉంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై స్పందిస్తూ, 150 సీట్లు కచ్చితంగా గెలుస్తామని నమ్మకం వ్యక్తం చేశారు.

రాహుల్ వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. కాంగ్రెస్ అగ్రనేతలు పగటి కలలు కనడం మానుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ నేతలు ఊహా జగత్తులో విహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకి 200కి పైగా సీట్లు రావడం ఖాయమని శివరాజ్ సింగ్ చౌహాన్ ధీమా వ్యక్తం చేశారు.

Shivraj Singh Chouhan
Rahul Gandhi
Assembly Elections
BJP
Congress
Madhya Pradesh
  • Loading...

More Telugu News