Vivek Kalra: ఆ సినిమాలో సమంతకి బదులుగా శ్రీలీలను తీసుకున్నారట!

The Chennai Story movie update
  • ఇంగ్లిష్ చిత్రంగా రూపొందుతున్న 'ది చెన్నై స్టోరీ'
  • ఇంతకుముందు తెరపైకి వచ్చిన సమంత పేరు 
  • తాజాగా శ్రీలీలను తీసుకున్నారనే సమాచారం 
  • వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్న శ్రీలీల  

ఇప్పుడు అంతా శ్రీలీల హవా నడుస్తోంది. ఏ ప్రాజెక్టు చూసినా ఆమె పేరునే వినిపిస్తోంది. రామ్ .. నితిన్ .. వైష్ణవ్ తేజ్ జోడీగా నటిస్తున్న ఈ బ్యూటీ, విజయ్ దేవరకొండ, మహేశ్ బాబు .. పవన్ సినిమాలలోను ఛాన్స్ కొట్టేసింది. ఇలా ఒక రేంజ్ లో ఈ సుందరి దూసుకుపోతోంది. అలాంటి ఈ సొగసరి మరో పెద్ద ప్రాజెక్టులోను ఛాన్స్ కొట్టేసిందని టాక్.

'ది చెన్నై స్టోరీ' అనే ఒక ఇంగ్లిష్ సినిమాను వివేక్ కల్రా హీరోగా రూపొందిస్తున్నారు. ఫిలిప్ జాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ముందుగా సమంత పేరు వినిపించింది. ఆమెను కథానాయికగా తీసుకున్నారనే ప్రచారం జరిగింది. ఆమెకి బదులుగా ఇప్పుడు శ్రీలీల పేరు వినిపిస్తోంది. 

ఇంగ్లాండ్ యువకుడికి .. చెన్నై కి చెందిన యువతికి మధ్య నడిచే ప్రేమ .. ఈ కథలో ప్రధానంగా కనిపిస్తుందని అంటున్నారు. మొత్తానికి శ్రీలీల ఖాతాలో మరో పెద్ద ప్రాజెక్టు చేరిపోయింది. ప్రస్తుతం బాలకృష్ణ - అనిల్ రావిపూడి సినిమా షూటింగులో శ్రీలీల బిజీగా ఉంది.

  • Loading...

More Telugu News