KL Rahul: లండన్ స్ట్రిప్‌క్లబ్‌లో కేఎల్ రాహుల్, అతియాశెట్టి.. నెటిజన్ల ట్రోలింగ్‌పై నటి కౌంటర్.. వీడియో ఇదిగో!

Athiya Shettys statement on visiting strip club with KL Rahul goes viral

  • స్ట్రిప్‌క్లబ్‌లో అతియా, రాహుల్ వీడియో వైరల్
  • మరీ దారుణంగా స్ట్రిప్ క్లబ్‌కు వెళ్లడమేంటంటూ నెటిజన్ల ఫైర్
  • నిందించేముందు వాస్తవాలు నిర్ధారించుకోవాలని సూచన

టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ భార్య అతియాశెట్టి ఇటీవల నెటిజన్ల నుంచి ట్రోలింగ్ ఎదుర్కొంది. లండన్‌లోని ఓ స్ట్రిప్‌క్లబ్‌లో ఆమె కనిపించిన వీడియో వైరల్ కావడమే ఇందుకు కారణం. ఓ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రికెటర్ భార్యవు అయి ఉండీ ఇలా స్ట్రిప్‌క్లబ్‌కు వెళ్లడమేంటంటూ నెటిజన్లు ఆమెపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో అతియాశెట్టి సోషల్ మీడియా ద్వారా తాజాగా స్పష్టతనిచ్చింది. ఇది కూడా వైరల్ కావడంతో చాలామంది అభిమానులు ఆమెకు అండగా నిలుస్తున్నారు.

సాధారణంగా తాను మౌనాన్నే ఎంచుకుంటానని, కానీ కొన్నిసార్లు మనకోసం మనం నిలబడడం చాలా ముఖ్యమని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో అతియా రాసుకొచ్చింది. రాహుల్, తాను, స్నేహితులం కలిసి రెగ్యులర్‌ ప్లేస్‌కే వెళ్లామని స్పష్టం చేసింది. ఇలాంటి విషయాల గురించి తెలుసుకోవడం ఆపి, నిందించడానికి ముందు వాస్తవాలను తెలుసుకోవాలని నెటిజన్లకు సూచించింది. ఈ పోస్టు తర్వాత నెటిజన్లు ఆమెకు అండగా నిలబడ్డారు. వారి వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూడడం ఆపాలని కోరారు. అయినా, వారు (అతియాశెట్టి, రాహుల్) దీనికి స్పందించాల్సిన పనిలేదని పేర్కొన్నాడు.

KL Rahul
Athiya Shetty
London Strip Club
  • Loading...

More Telugu News