Prabhas: రికార్డు స్థాయిలో ప్రభాస్ 'ఆదిపురుష్' బిజినెస్.. కళ్లు చెదిరే రేటుకు తెలుగు రాష్ట్రాల రైట్స్

  • జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న 'ఆదిపురుష్'
  • తెలుగు రాష్ట్రాల రైట్స్ రూ. 185 కోట్లకు అమ్ముడైనట్టు సమాచారం
  • రైట్స్ ను సొంతం చేసుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ
Prabhas Adipurush film Telugu states rights sold for record price

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' చిత్రం జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో సీత పాత్రను కృతి సనన్, రావణుడి పాత్రను సైఫ్ అలీ ఖాన్ పోషించారు. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదలైన ట్రైలర్ కు అనూహ్యమైన స్పందన వచ్చింది.

 మరోవైపు ఈ సినిమా బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపైన ఏపీ, తెలంగాణలో రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్టాల రైట్స్ ను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు దాదాపు రూ. 185 కోట్లకు సొంతం చేసుకున్నట్టు చెపుతున్నారు. ఈ డీల్ ను ప్రభాస్ దగ్గరుండి చేయించాడని సమాచారం. నైజాం రైట్స్ ను రూ. 80 కోట్లకు, ఈస్ట్ గోదావరి రైట్స్ ను రూ. 15 కోట్లకు, సీడెడ్ రైట్స్ ను రూ. 15 కోట్లకు అమ్మేసినట్టు తెలుస్తోంది. జూన్ 6న తిరుపతిలో ప్రీరిలీజ్ ఈవెంట్ జరగబోతోంది.

More Telugu News