Upasana: రెడ్ శారీలో మెరిసిపోతున్న రామ్ చరణ్ భార్య ఉపాసన.. ఫొటోలు వైరల్

Ramcharan wife Upasana shares first trimester pregnancy pics

  • తొలి త్రైమాసిక గర్భం ఫొటోలను షేర్ చేసిన ఉపాసన
  • బేబీ బంప్ తో ఉన్న చరణ్ అర్ధాంగి
  • శారీని డిజైన్ చేసిన బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ మనీశ్ మల్హోత్రా

టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా అవతరించారు. ఉత్తరాదిన కూడా రామ్ చరణ్ క్రేజ్ భారీగా పెరిగింది. మరోవైపు చరణ్ భార్య ఉపాసన కూడా తన భర్తకు అన్నివేళలా తోడుగా ఉంటూ ఆయన సక్సెస్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉపాసన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. చరణ్ కు సంబంధించిన అప్డేట్స్ ను ఇస్తుంటారు. అంతేకాదు ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో సూచనలను పంచుకుంటుంటారు. తాను చేసే సామాజిక సేవ వివరాలను తెలియజేస్తుంటారు. 

ఉపాసన ప్రస్తుతం గర్భవతి అనే విషయం తెలిసిందే. తన సీమంతం ఫొటోలు, బేబీ బంప్ పిక్స్ ను ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తాజాగా ఆమె తన తొలి త్రైమాసిక గర్భానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. ఈ ఫొటోలలో రెడ్ కలర్ శారీలో ఆమె మెరిసిపోతున్నారు. ఈ చిత్రాల్లో ఆమె బేబీ బంప్ ను కూడా చూడొచ్చు. ఈ శారీని ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ మనీశ్ మల్హోత్రా డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Upasana
Ramcharan
Tollywood
first trimester pregnancy
  • Loading...

More Telugu News