Prakasam District: త్రిపురాంతకంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విజయవాడ వాసుల దుర్మరణం

4 dead in an accident held in Prakasam District Tripurantakam

  • ఢీకొన్ని ఆర్టీసీ బస్సు, కారు
  • మృతులను విజయవాడ వాసులుగా గుర్తింపు
  • అనంతపురంలో వివాహ వేడుక కోసం డెకరేషన్ చేసి వస్తుండగా మృత్యువాత

ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో గత రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. వీరిని విజయవాడ వాసులుగా గుర్తించారు. ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ నుంచి హిందూపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు గుంటూరు వైపు నుంచి వస్తున్న కారు బలంగా ఢీకొన్నాయి. 

ఈ ఘటనలో కారులో ఉన్న విజయవాడకు చెందిన చంద్రశేఖర్, శ్రీను, సాయి, మరో యువకుడు శ్రీను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతపురంలో ఓ వివాహ వేడుక కోసం మండపాన్ని అలంకరించి వస్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Prakasam District
Tripurantakam
Road Accident
Vijayawada
  • Loading...

More Telugu News