Pawan Kalyan: పవన్ కల్యాణ్ షూటింగ్ సెట్ లో అగ్ని ప్రమాదం

Fire accident in Pawan Kalyan shooting set

  • దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో షూటింగ్ సెట్
  • నిన్న అర్ధరాత్రి సంభవించిన అగ్నిప్రమాదం
  • మంటలను ఆర్పివేసిన అగ్నిమాపక సిబ్బంది

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం షూటింగ్ సెట్ లో అగ్నిప్రమాదం సంభవించింది. నిన్న అర్ధరాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ శివార్లలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌరంపేటలో షూటింగ్ సెట్ వేశారు. వెల్డింగ్ పనులు చేస్తున్న సమయంలో థర్మాకోల్ అంటుకుని అగ్నిప్రమాదం జరిగింది. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Pawan Kalyan
Janasena
Tollywood
Shooting Set
Fire Accident
  • Loading...

More Telugu News