Mass Shooting: అమెరికాలో మరోసారి కాల్పులు... ముగ్గురి మృతి

Three died in shooting at a motor bike rally in US
  • న్యూ మెక్సికో రాష్ట్రంలోని రెడ్ రివర్ నగరంలో ఘటన
  • రెడ్ రివర్ మెమోరియల్ డే సందర్భంగా మోటార్ బైక్ ర్యాలీ నిర్వహణ
  • కాల్పులు జరిపిన బైకర్ గ్యాంగుల సభ్యులు
అమెరికాలో మరో కాల్పుల ఘటన నమోదైంది. న్యూ మెక్సికో రాష్ట్రంలోని రెడ్ రివర్ నగరంలో  కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఐదుగురు గాయపడ్డారు. కాగా, కాల్పులకు పాల్పడినవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు రెడ్ రివర్ నగర మేయర్ లిండా కాల్హన్ తెలిపారు. 

రెడ్ రివర్ మెమోరియల్ డే  సందర్భంగా నిర్వహించిన ఓ మోటార్ సైకిల్ ర్యాలీ సందర్భంగా కాల్పులు జరిగాయని వివరించారు. బైకర్ గ్యాంగుల సభ్యులు ఈ కాల్పులు జరిపారని మేయర్ వెల్లడించారు. గాయపడిన వారిని టావోస్ లోని హోలీ క్రాస్ ఆసుపత్రికి, అల్బుక్విర్క్ లోని న్యూ మెక్సికో యూనివర్సిటీ హెల్త్ సెంటర్ కు తరలించినట్టు పోలీసులు వెల్లడించారు.
Mass Shooting
Red River City
New Mexico
USA

More Telugu News