IPL: ఐపీఎల్ ఫైనల్ కు వర్షం దెబ్బ... టాస్ కు కూడా అవకాశం ఇవ్వకుండా బాదేస్తున్న వరుణుడు

Rain delays IPL final start
  • ఐపీఎల్ ఫైనల్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్
  • నేడు అమీతుమీకి సిద్ధమైన ధోనీ గ్యాంగ్, హార్దిక్ సేన
  • అహ్మదాబాద్ లో వర్షం 
  • పిచ్ ను కవర్లతో కప్పిన సిబ్బంది
ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ కు వర్షం అడ్డంకిగా మారింది. ఇవాళ అహ్మదాబాద్ లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ఐపీఎల్ టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే, మ్యాచ్ కు ముందు వర్షం ప్రారంభమైంది. దాంతో టాస్ వేయడానికి కూడా వీలు కాలేదు. 

వర్షం పడుతూనే ఉండడంతో ఇక్కడి నరేంద్ర మోదీ స్టేడియంలోని పిచ్ ను, సర్కిల్ ను కవర్లతో కప్పి ఉంచారు. ఈ ఫైనల్ మ్యాచ్ కు రిజర్వ్ డే లేకపోవడంతో వర్షం తగ్గాలని, మ్యాచ్ జరగాలని అభిమానులు కోరుకుంటున్నారు.
IPL
Rain
Final
Ahmedabad

More Telugu News