NTR: న్యూయార్క్ టైమ్ స్క్వేర్ లోనూ మెరిసిన ఎన్టీఆర్ కీర్తి... వీడియో ఇదిగో!

NTR ad display at New York Time Square

  • నేడు ఎన్టీఆర్ జయంతి
  • ప్రపంచవ్యాప్తంగా ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
  • టైమ్ స్క్వేర్ లో డిజిటల్ స్క్రీన్ పై ఎన్టీఆర్ ప్రకటన 

తెలుగు జాతి ఖ్యాతిని ఇనుమడింపజేసిన మహనీయుడు, మహానటుడు, తెలుగుదేశం పార్టీ  వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు శతజయంతి వేళ ప్రపంచవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. అమెరికాలోని ప్రపంచ ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్ స్క్వేర్ లో డిజిటల్ స్క్రీన్ పైనా ఎన్టీఆర్ కాంతులు విరజిమ్మాడు. 

గత అర్ధరాత్రి నుంచి ఈ అర్ధరాత్రి వరకు ఈ ప్రకటన టైమ్ స్క్వేర్ లో ప్రసారం కానుంది. ఎన్టీఆర్ రామారావు కెరీర్ లోని వివిధ క్యారెక్టర్లను ఈ డిజిటల్ స్క్రీన్ పై ప్రదర్శించారు. టైమ్ స్క్వేర్ లో ప్రతి నాలుగు నిమిషాలకోసారి 15 సెకన్ల పాటు ఈ ప్రకటన డిస్ ప్లే అవుతుంది. ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో ఈ ప్రకటన ఏర్పాటు చేశారు.

NTR
New York Time Square
Anniversary
NRI TDP
Andhra Pradesh
USA
  • Loading...

More Telugu News