TDP: రాజమండ్రిలో టీడీపీ భారీ బహిరంగ సభ ప్రారంభం... వేదికపైకి చంద్రబాబు, బాలకృష్ణ

TDP meeting in Rajahmundry just commenced

  • రాజమండ్రిలో టీడీపీ మహానాడు
  • ఈ సాయంత్రం భారీ బహిరంగ సభ
  • చంద్రబాబుకు నాగలి సమర్పించిన టీడీపీ నేతలు

రాజమండ్రిలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడులో భాగంగా ఈ సాయంత్రం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సభా వేదికపైకి చేరుకున్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు ప్రతిమకు నివాళులు అర్పించారు. 

ఈ సందర్భంగా టీడీపీ నేతలు, అభిమానులు చంద్రబాబుకు నాగలి బహూకరించారు. నాగలి, చర్నా కోల, వరి కంకులు పట్టుకుని చంద్రబాబు చిరునవ్వులు చిందించారు. అనంతరం చంద్రబాబుకు ముస్లింలు పవిత్ర వస్త్రాలను, టోపీని అందించగా, వాటిని ఆయన ధరించారు. 

కాగా, భారీ జనసందోహం తరలిరావడంతో ఇవాళ మహానాడు ప్రాంగణం క్రిక్కిరిసిపోయింది. ఓ దశలో గాలులు, జల్లులు ఆందోళనకు గురిచేసినా, కొద్దిసేపట్లోనే వాతావరణం సాధారణ స్థితికి చేరుకోవడంతో టీడీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.

TDP
Meeting
Chandrababu
Balakrishna
TDP Mahanadu
Rajahmundry
  • Loading...

More Telugu News