Harish Rao: విపక్షాలను ప్రకృతి విపత్తులతో పోల్చిన మంత్రి హరీశ్

  • ప్రతిపక్షాలు జూటా మాటలు చెబుతున్నాయన్న హరీశ్ రావు
  • రాష్ట్ర గౌరవాన్ని కించపర్చేలా మాట్లాడుతున్నారని విమర్శలు
  • విపక్ష నేతల మాటలను ప్రజలే తిప్పికొట్టాలని పిలుపు 
Harish Rao slams opposition party leaders

తెలంగాణ ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్ రావు విపక్షాలపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా విపక్షాలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. జూటా మాటాలు (అబద్ధాలు) తప్ప ప్రతిపక్షాల నోటి వెంట మరో మాట రావడంలేదని అన్నారు.

బీజేపీ, కాంగ్రెస్ నేతలు తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని దిగజార్చే విధంగా మాట్లాడుతున్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విపక్షాలు ప్రకృతి విపత్తుల కంటే ప్రమాదకరంగా తయారయ్యాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. విపక్షాల విమర్శలను ప్రజలే తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. 

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో 100 బెడ్ల ప్రభుత్వ ఆసుపత్రి భవనానికి హరీశ్ రావు ఇవాళ శంకుస్థాపన చేశారు. అనంతరం గండిమాసానిపేట్ లో నిర్మించిన బస్తీ దవాఖానాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హరీశ్ రావు పైవ్యాఖ్యలు చేశారు.

More Telugu News