Rana Daggubati: తేజ - రానా సినిమా టైటిల్ ఇదే!

teja revealed rana new movie title

  • ‘రాక్షస రాజు’ అనే పేరును పరిశీలిస్తున్నట్లు చెప్పిన తేజ
  • 45 మంది కొత్త వారిని పరిచయం చేయబోతున్నట్లు వెల్లడి
  • చీరాల నుంచి కనీసం 10 మంది ఆర్టిస్టులు కావాలని వ్యాఖ్య

రానా సోదరుడు అభిరామ్‌ హీరోగా డైరెక్టర్ తేజ తెరకెక్కించిన ‘అహింస’ సినిమా జూన్ 2న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో తన తర్వాతి సినిమా గురించి ప్రకటించారు తేజ. అది కూడా రానాతోనే చేయనున్నట్లు తెలిపారు. ‘నేనే రాజు.. నేనే మంత్రి’ తర్వాత వీళ్లిద్దరి కాంబోలో వస్తున్న సినిమా పేరును కూడా చెప్పేశారు. ‘రాక్షస రాజు’ అనే పేరును పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.  

మరోవైపు ఎప్పటిలాగే ఈ సినిమాతో కూడా 45 మంది కొత్త వారిని సిల్వర్ స్క్రీన్‌కు పరిచయం చేయబోతున్నానని తేజ తెలిపారు. ఆసక్తి ఉన్న వాళ్లు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తనను సంప్రదించవచ్చని సూచించారు. లెజెండరీ నిర్మాత రామానాయుడు స్వస్థలమైన చీరాల నుంచి కనీసం 10 మంది ఆర్టిస్టులు కావాలని చెప్పారు. 

రానా-తేజ సినిమాలో ప్రముఖ మలయాళ హీరో కీలక పాత్రలో నటించనున్నారని సమాచారం. అతి త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. టాప్‌ హీరో, దేవుడు, జంబ లకిడి పంబ లాంటి సూపర్ హిట్‌ సినిమాలను తెరకెక్కించిన గోపీనాథ్‌ ఆచంట ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ‘రాక్షస రాజు’ గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే మరి.

Rana Daggubati
Director Teja
Ahimsa
Rakshasa Raju
  • Loading...

More Telugu News