shaakuntalam: శాకుంతలం.. డబ్బులు రాకపోయినా.. అవార్డులొచ్చాయ్!

samantha shaakuntalam movie bags four awards cannes film festival
  • కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో శాకుంతలం సినిమాకు అవార్డులు
  • ఫారిన్ ఫిల్మ్, ఫాంటసీ ఫిల్మ్, కాస్ట్యూమ్ డిజైన్, ఇండియన్ ఫిల్మ్ కేటగిరీల్లో సత్తా 
  • సోషల్ మీడియాలో వెల్లడించిన గుణటీమ్ వర్క్స్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, మలయాళ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఎన్నో అంచనాల మధ్య ఏప్రిల్‌ 14న విడుదలై.. కనీస వసూళ్లను కూడా రాబట్టుకోలేకపోయింది. అభిమానులను మెప్పించలేకపోయిన ఈ సినిమాకు అవార్డులు మాత్రం బాగానే వస్తున్నాయి.

శాకుంతలం సినిమాకు గతంలో న్యూయార్క్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్స్ అవార్డ్స్- 2023లో బెస్ట్ ఫాంట‌సీ ఫిల్మ్‌గా, బెస్ట్ మ్యూజిక‌ల్ ఫిల్మ్‌గా అవార్డులు వచ్చాయి. తాజాగా ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ అవార్డులను కొల్లగొట్టింది. ఈ సినిమాకు నాలుగు విభాగాల్లో అవార్డులు దక్కాయి.

బెస్ట్ ఫారిన్ ఫిల్మ్, బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్, బెస్ట్ ఇండియన్ ఫిల్మ్ కేటగిరీల్లో శాకుంతలం సత్తా చాటింది. ఈ విషయాన్ని గుణటీమ్ వర్క్స్ తమ ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్ ఖాతాల్లో షేర్ చేసింది. కాగా, థియేట‌ర్ల‌లో రిలీజై నెల రోజులు కూడా కాక‌ముందే శాకుంతలం సినిమా ఓటీటీలోకి వ‌చ్చేసిన సంగతి తెలిసిందే.
shaakuntalam
Samantha
cannes film festival
GunaaTeamworks
guna sekhar

More Telugu News