Sharwanand: జరిగింది చిన్న ప్రమాదమే... నాకేం కాలేదు: శర్వానంద్

Sharwanand says it was a minor accident

  • ఈ ఉదయం హైదరాబాదులో శర్వా కారుకు ప్రమాదం
  • ఫిలింనగర్ జంక్షన్ వద్ద డివైడర్ ను ఢీకొట్టిన కారు
  • ప్రమాదం జరిగిన సమయంలో కారులోనే ఉన్న శర్వానంద్ 
  • డ్రైవర్ కు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించిన పోలీసులు

హైదరాబాదులో టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ కారుకు ఈ ఉదయం ప్రమాదం జరిగింది. అయితే శర్వానంద్ పరిస్థితి తెలియకపోవడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో, శర్వానంద్ స్పందించారు. 

జరిగింది చిన్న ప్రమాదమేనని వివరణ ఇచ్చారు. తాను క్షేమంగానే ఉన్నానని, తనకు ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేశారు. తన గురించి బాధపడొద్దని... అందరి ప్రేమ, దీవెనలతో తాను క్షేమంగానే ఉన్నానంటూ శర్వా ట్వీట్ చేశారు. మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. 

ఈ తెల్లవారుజామున ఫిలింనగర్ జంక్షన్ వద్ద శర్వానంద్ ప్రయాణిస్తున్న కారు రోడ్ డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కారు డ్రైవర్ కు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించారు. డ్రైవర్ మద్యం సేవించలేదని తెలిసింది.

Sharwanand
Road Accident
Film Nagar
Hyderabad
Tollywood
  • Loading...

More Telugu News